వాలీబాల్‌కు మంచి ఆదరణ

–  సినీ హీరో విజరు దేవరకొండ
– ప్రైమ్‌వాలీబాల్‌ లీగ్‌లో సందడి
నవతెలంగాణ, హైదరాబాద్‌ 
భారత్‌లో వాలీబాల్‌కు మంచి ఆదరణ లభిస్తుందని, క్రీడాభిమానులకు వాలీబాల్‌ ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారనుందని సినీ నటుడు విజరు దేవరకొండ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు వచ్చిన విజరు అభిమానులతో కలిసి మ్యాచ్‌ వీక్షించాడు. ‘ వాలీబాల్‌ అంటే ఇష్టం, హైదరాబాద్‌ అంటే ఎంతో ఇష్టం. స్కూల్‌ డేస్‌లో వాలీబాల్‌ బాగా ఆడేవాళ్లం. ఎటాకర్లను ఎక్కువగా అనుసరించే వాళ్లం. భారత్‌లో వాలీబాల్‌కు మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి ఐదు నిమిషాలకు ములుపు తిరిగే వాలీబాల్‌ రానున్న రోజుల్లో క్రీడాభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కానుందని’ విజరు అన్నారు. ఇదిలా ఉండగా, చెన్నై బ్లిట్జ్‌పై హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ 3-2తో విజయం సాధించింది. 10-15, 15-14, 15-9, 12-15, 15-11తో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది.హైదరాబాద్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ బ్లాక్‌హాక్స్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాలు సాధించటం విశేషం.

Spread the love