వికలాంగులకు పీఎన్‌బీ సాయం

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా నగరంలోని వికలాంగులు, అంధులు, సీనియర్‌ సిటిజన్స్‌కు సాయం అందించింది. ఆ బ్యాంక్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ ఆఫీసు ఆధ్వర్యంలో వెల్పేర్‌ ఆఫ్‌ డిజెబుల్డ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజేందర్‌ సారథ్యంలో 770 మందికి మద్దతును అందించింది. పీిఎన్‌బీ సర్కిల్‌ హెడ్‌ ఎన్‌విఎస్‌పి రెడ్డి 36 సీలింగ్‌ ఫ్యాన్లు అందించారు.

Spread the love