విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి

నవతెలంగాణ -ఎల్బీనగర్‌
సరూర్‌నగర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ప్రజలకు, విద్యార్థులకు బస్‌ సౌకర్యం ఎలా ఉందని లింగోజీగుడ డివిజన్‌ కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి తెలుసుకున్నారు. బుధవారం బస్టాఫ్‌ వద్ద విద్యార్థులతో మాట్లాడి సరైన వేలకు బస్‌లు వస్తున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనేక మంది విద్యార్థులు బస్సులు రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఉదయం 8 గంటలకు నుండి 9 గంటల వరకు బస్‌ స్టాప్‌లో ఉండి ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ, ఆఫీస్‌కి వెళ్లేవారు గంటల తరబడి బస్‌స్టాప్‌లో బస్‌ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వేళకు బస్సులు రాకపోవడంతో కాలేజీ, స్కూల్‌ విద్యార్థులు క్లాసులు మిస్‌ అవుతున్నారన్నారు. అనంతరం దిల్‌సుఖ్‌నగర్‌ డిపో మేనేజర్‌ని కలిసి సమస్యలను వివరించారు. దీంతో అదనంగా బస్సులు నడిపిస్తామని డిపో మేనేజర్‌ హామీ ఇచ్చారని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

Spread the love