నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర ప్రభుత్వం ఏసిడి చార్జీల పేరిట విద్యుత్ చార్జీలను తమ ఇష్టానుసారం పెంచి సామాన్య ప్రజల నడ్డి విడుస్తుందని డిసిసి ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఏసిడి చార్జీలను తగ్గించేంత వరకు విద్యుత్ చార్జీలు ఎవరు చెల్లించవద్దన్నారు. ఏ సి డి చార్జీలు వినియోగదారులపై అదనపు భారం పడుతుందని, ఏ సి డి చార్జీలు తగ్గించేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సి డి చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు కుంట లింగారెడ్డి, పట్టణ యూత్ నాయకుడు ద్యాగాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.