వివాహ శుభకార్యానికి హాజరుకావాలని ప్రభుత్వ విప్ కు ఆహ్వాన పత్రిక

నవతెలంగాణ-భిక్కనూర్
మండల మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన తన కుమారుని వివాహం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో ఉన్నందున వివాహ శుభకార్యానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నిట్టు వేణుగోపాలరావు, జూకంటి ప్రభాకర్ రెడ్డి, కాచాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బైండ్ల భూపతి, వార్డు సభ్యుడు మురళి తదితరులు పాల్గొన్నారు.

Spread the love