విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ-నేరేడ్‌ మెట్‌
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మల్కాజిగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం నేరేడ్‌ మెట్‌ అంబేద్కర్‌ భవన్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రావుల అంజయ్య, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతజు బ్రహ్మచారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో పాటు విశ్వబ్రాహ్మణ సభ్యులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..కుల సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాంపల్లి సోమచారి, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు, భాష పల్లి రమేష్‌ చారి, కాప్రా మండలాధ్యక్షుడు మారోజు రమేష్‌ బాబు, కాప్రా మండల ప్రధాన కార్యదర్శి, ఎన్‌. నాగరాజు చారి, మల్కాజిగిరి మండలాధ్యక్షుడు బంగారు మల్లేష్‌ చారి, ప్రధాన కార్యదర్శి నేదునూరు శ్రీనివాస్‌చారి, మండల కోశాధికారి అనంతోజు శ్రవణ్‌ కుమార్‌, ప్రచార కార్యదర్శి వెంకట చారి, శివ గణేష్‌, మల్కాజి గిరి మహిళా అధ్యక్షురాలు మాజోజు హేమలత, ప్రధాన కార్యదర్శి, ఏదులాపురం లక్ష్మి, సలహాదారుడు సోమచంద్రం, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love