న్యూఢిల్లీ : ప్రొఫెసర్ సుదీప్త భట్టాచార్య తొలగింపును వ్యతిరేకిస్తూ 261 మంది విద్యావేత్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన బెంగాల్ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ అసోసియేషేన్ ప్రెసిడెంట్, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న భట్టాచార్యను నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీ వీసీ తొలగించారని ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు రాష్ట్రపతిని కోరారు.