విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..

– హెల్త్‌ బులిటెన్‌ విడుదల
– ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
బెంగళూరు :
సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా తారకరత్న హెల్త్‌ కండీషన్‌పై బులెటిన్‌ను హృదయాలయ డాక్టర్లు శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. తారకరత్నను గత రాత్రి ఒంటి గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకువచ్చారని వెల్లడించారు.
అప్పటికి ఆయన ఆరో గ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. నిపుణులతో కూడిన తమ వైద్య నిపుణుల బృందం ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరి స్థితిని పర్యవేక్షిస్తోందని, ఆయన పరిస్థితి ఇంకా విష మంగానే ఉందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరు లోని ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్నకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకు న్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధే శ్వరి, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్‌, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, చిన రాజప్ప తదితరులు ఆస్పత్రికి చేరు కున్నారు. నందమూరి అభిమానులు భారీగా తరలిరావడంతో నారాయణ హృద యాలయ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. నిన్న కుప్పంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే.

Spread the love