వీధికుక్కల నివారణకు చర్యలు :అరవింద్‌కుమార్‌

నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, నగర పరిసర మున్సిపాలిటీల పరిధులల్లో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్దప్రాతిపథికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ కార్యలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జిహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హౌటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌ సెంటర్స్‌, మటన్‌ సెంటర్లు వ్యర్థపదార్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు పెంపుడు కుక్కల గురించి అవగాహన లేకపోవడంతో వాటిన భారిన పడుతున్నారని. దీనిని నియంత్రించడానికి విద్యార్థులకు కూడా సరైన అవగాహన పెంపొందిం చాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, హౌర్డింగ్స్‌ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పెంపుడు జంతువుల నమోదు గురించి కూడా ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 040 – 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

Spread the love