వ్యాక్సిన్‌ తీసుకున్నా…

– జాగ్రత్తలు పాటించాల్సిందే :డాక్టర్‌ రాజీవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రగడ్డ ఛాతి వైద్యశాల కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ రాజీవ్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తీసుకున్న వ్యాక్సిన్‌ ఇప్పటి వరకున్న వేరియంట్లపై చూపించినంతగా, కొత్త వేరియంట్లపై ప్రభావం చూపించలేవని స్పష్టం చేశారు. అందువల్ల ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అవసరమైతే తప్ప రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం తదితర కరోనాకు సంబంధించిన జాగ్రత్తలను కొనసాగించాలని తెలిపారు.

Spread the love