మహాశివరాత్రి… ఉపాసం… జాగారం. గుడిలో లింగంపై పంచామృతాలంటూ పాలు, పెరుగు, తేనే, నెయ్యి, నీళ్లుపోసి కడిగేసే! కడుపు కాల్చుకొని ఉపాసం ఉండబట్టే! నిద్రలేని రాత్రితో జాగారం చేసి, మోక్షాన్ని పొందినట్టు ఫీల్ కాబట్టే!! బాగుంది. ఓసారి రివర్స్ ఇంజినీరింగ్‌లో దీన్ని తిరగేద్దాం? ‘మన్ కీ బాత్’ అంటూ కడుపులో సల్ల కదలకుండా, వన్ వే ట్రాఫిక్ మాదిరి కూసున్న దగ్గరే నీతుల్ని వల్లిస్తూ భారతీయులు ఎలా ఉండాలో ఆ పెద్దమనిషి చెప్పబట్టే! కోరికలు సంపుకోవాలే…చెప్పింది వినాలే… కాదంటే కృష్ణ జన్మస్థానమే నంటే గమ్మునుండాలే! ఏడాదికోపాలైనా కాయో, పండో తిందామంటే జీఎస్టీ దెబ్బకి ఉపాసమే బెటర్ అనిపించబట్టే! మతరాజ్యం గుర్తుకు రాగానే భవిష్యద్దర్శనంతో జాగారమే మిగిలే!! త్యాగానికి గుర్తుగా త్రివర్ణపతాకంలో స్థానం దక్కించుకున్న ‘కాషాయం’ చూడగానే శివతత్వం స్థానంలో మూకదాడులు, ఉన్మాద చేష్టలు, కార్పొరేట్ల దోపిడీ, పెరిగిన ధరలు, ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితి గుర్తుకురాబట్టే!! అఘోర ధిక్కార స్వరంతో ప్రజాచైతన్యం పెచ్చరిల్లితే తప్ప… ఈ కషాయ బానిసత్వ బంధన విముక్తి లభించేలా లేదయ్యా…. శివయ్యా..అంతేనంటావా??
-ఎస్.ఎస్.ఆర్.శాస్త్రి