శ్రీనిధి లోన్స్‌లో భారీ అవకతవకలు !

-మహిళా పొదుపు సంఘం
– లీడర్ల ప్రమేయం లేకుండానే
– రూ.3లక్షల94 వేలు ట్రాన్స్ఫర్‌ ?
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో శ్రీనిధి లోన్స్‌ వ్యవహారంలో లక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనిపై గ్రామ ఐక్య సంఘం సభ్యులు గ్రామంలోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు శ్రీనిధి మేనేజర్‌ మహేష్‌, ఏపిఎం సత్యనారాయణ, సిఏ శ్రీధర్‌ ఐకెపి అధికారులను నిలదీశారు. గ్రామంలోని మహిళా పొదుపు సంఘం సభ్యుల వివరాల ప్రకారం లక్ష్మీ పురం గ్రామంలో శ్రీరామ ఆంజనేయ గ్రామ ఐక్య సంఘం 18 మహిళా సంఘాలతో ఉంది. ఈ క్రమంలో కొన్ని మహిళా పొదుపు సంఘాలు గ్రామైక్య సంఘం నుండి శ్రీనిధి లోన్స్‌ తీసుకు న్నాయి. వారి అప్పును కూడా నెల నెల చెల్లించు కుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్ని మహిళా సంఘాలు శ్రీనిధి లోన్‌ కట్టలేకపోయాయి. కొన్ని మహిళా పొదుపు సంఘాల శ్రీనిధి లోన్‌ పెండింగ్‌ ఉండడంతో గ్రామంలోని అప్పు ఉన్న ,అప్పు లేని అన్ని సంఘాల నుండి మహిళా పొదుపు సంఘాల లీడర్ల ప్రమేయం లేకుండా ఇందిరా క్రాంతి అధికారులు, శ్రీనిధి అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి ప్రతి సంఘం నుండి రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు డబ్బులను శ్రీనిధికి ఎకౌంటుకు ట్రాన్స్ఫర్‌ చేసినట్టు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే శ్రీనిధి అప్పు ఉన్న సంఘం శ్రీనిధి లోన్‌ అప్పు కట్టినప్పటికీ తక్కువ రూపాయలు కట్టినట్టు అవినీతి లెక్కలు చెబుతు న్నారని వాపోతున్నారు. ఈ తతంగం రెండు నెలలుగా జరుగుత్నుఆ్న ఐకెపి అధికారులు మాత్రం ఎటు తేల్చలేక పోతున్నారు. దీంతో ఐకెపి అధికారుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై శ్రీనిధి అధికారులు కూడా అప్పు ఉన్న సంఘం నుండి అప్పు లేని సంఘం నుండి దాదాపు రూ.3 లక్షల94వేలు మహిళా పొదుపు సంఘాల నుండి శ్రీనిధి అకౌంట్‌ కి ట్రాన్స్ఫర్‌ చేశామని పేర్కొంటున్నారు. అవసరం అయిత మళ్లీ మహిళా పొదుపు సంఘం అకౌంట్‌ కి ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని మహిళా పొదుపు సంఘం సభ్యులకు చెప్పడం గమనార్హం. దీని వెనక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని లక్ష్మీపురం మహిళా పొదుపు సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ చొరవ తీసుకొని విచారణ జరిపి అవినీతి అధికా రులపై చర్యలు తీసుకోవాలని సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Spread the love