షెఫాలీ మెరుపులు

– యుఏఇపై 122పరుగుల తేడాతో గెలుపు
– ఐసిసి అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌
బెనోని(దక్షిణాఫ్రికా): అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌లో భారతజట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం యుఏఇ మహిళలతో జరిగిన పోటీలో భారత్‌ 122పరుగుల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన షెఫాలీ వర్మ నేతృత్వంలోని భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టపోయి 219పరుగులు చేసింది. ఓపెనర్లు శ్వేత(74నాటౌట్‌బీ 49బంతుల్లో 10ఫోర్లు), షెఫాలీ(78బీ 34బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లు) తొలి వికెట్‌కు 8.3ఓవర్లలో 111పరుగులు జతచేశారు. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌ రీచా(49బీ 29బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) కూడా బ్యాటింగ్‌లో రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు నష్టపోయి 97పరుగులు చేయగల్గింది. మహిక(26), లావణ్య(24) బ్యాటింగ్‌లో రాణించగా.. షబ్నమ్‌, టిటాస్‌, కశ్యప్‌, చోప్రాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షెఫాలీ వర్మకు లభించగా.. గ్రూప్‌-డిలో భారత్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ 18న స్కాట్లాండ్‌తో తలపడనుంది.

Spread the love