సంతకాలు లేకుండా పేమెంట్‌ ఎలా చేశారు

– పని కొలతలు చేయనిదే బిల్లులు చేస్తారా
– టీఏలపై డీఆర్‌డీవో పీడీ ఫైర్‌
– సామాజిక తనిఖీ ప్రజా వేదికలో డీఆర్డీవో పీడీ గోపాల్‌ నాయక్‌
నవతెలంగాణ-నర్వ
ఉపాధి హామీ పనులలో భాగంగా పనులు చేసిన మాస్టర్‌లపై కూలీల సంత కాలు లేనిదే బిల్లులు ఎలా చేశారని టీఏలపైన డీఆర్‌డీవో పీడీ గోపాల్‌ నాయక్‌ ఫైర్‌ అయ్యారు. గురువారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉపాధిహామీ పథకం 12వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఆయన పాల్గొన్నారు. మండలంలో గత 2019 డిసెంబర్‌ నెల నుంచి 2022 మా ర్చి వరకు నిర్వహించిన పనులపైన ఎంపీడీవో రమేష్‌ కుమార్‌, ఏపీవో మొగుల ప్పల ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 19 గ్రామాలకు గాను మొత్తం రూ. 11 లక్షల 30 వేలు వచ్చాయని తెలిపారు. వీటికి సంబంధించి ఆయా పంచాయతీలలో మెటీరియల్‌ రూ.3 లక్షల 28 వేలు, కూలీల ఖర్చులు రూ.8 లక్షల 82వేలు పనులు చేయడం జరిగిందన్నారు.
ఆయా గ్రామాల్లో పనులకు తగ్గ ఖర్చులు చూపకపోవడంతో రూ.38 వేల 300 రికవరీకి పీడీ గోపాల్‌ నాయక్‌ అధికారులను ఆదేశించారు. తప్పిదాలు చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు కలిపి రూ. 3 వేలు ఫైన్‌ను విధించారు. రికవరీ, ఫైన్‌ కలిపి మొత్తం రూ. 41 వేల 3 వందలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో పనులు చేసిన జాబితాలను, ఖర్చు చేసిన వివరాలను ప్రజా వేదికలోకి బృందం చదివి వినిపించారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌ తదితర వాటిలో నిర్లక్ష్యం వహించిన వారికి మెమోలు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయ రాములు శెట్టి, వైస్‌ ఎంపీపీ వీణావతి, అంబుడ్స్‌ మెన్‌లు ప్రసాద్‌ కుమార్‌, శ్రీనివాసరావు, నాగిరెడ్డి, ఇతర శాఖా అధికారులు, ఈజీఎస్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సామాజిక తనిఖీ బృందం పాల్గొన్నారు.

Spread the love