సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలం : కాంగ్రెస్‌

నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణ సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విఫలమయ్యాడని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయ ణరావు ఆరోపించారు. ఆదివారం నాలుగో రోజు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర భూపాలపల్లి పట్టణంలో కొనసాగింది. ముందుగా పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాల యంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్‌ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి లహరి కష్ణమాచార్యులు స్వాగతం పలికి గండ్ర సత్యనారాయణ రావును సన్మానిం చారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్‌ దేవన్‌ ఆధ్వర్యంలో ఆయా కాలనీలల్లో ఏర్పాటు చేసిన కాం గ్రెస్‌ పార్టీ జెండా లను ఆవిష్కరించి సత్యనారాయణ రావు మాట్లాడారు. స్థా నిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంపాదనే ధ్యేయంగా పా ర్టీ మారారని అన్నారు. గోదావరి జలాలు నియోజకవర్గ త లాపునే ఉన్నా భూపాలపల్లి పట్టణానికి తాగునీరందించని ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ముందు భూ పాలపల్లి పట్టణం చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మిస్తానని చెప్పి విస్మ రించాడన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడం లేదన్నారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన కాలనీవాసుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామన్నారు. టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ వెంపటి భువనసుందర్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రెసిడెంట్‌ మకరుణాకర్‌, నాయకులు బుచ్చయ్య, మకొమురయ్య, తోట సంతోష్‌, 5వ వార్డు కౌన్సిలర్‌ సరోజన- రాయమల్లు, కౌన్సిలర్‌ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Spread the love