సరికొత్తగా బాలుగాడి లవ్‌స్టోరీ

ఆకుల భాస్కర్‌ సమర్పణలో భామ క్రియేషన్స్‌ పతాకంపై ఆకుల అఖిల్‌, దర్శక మీనన్‌, చిత్రం శ్రీను, జబర్దస్త్‌ గడ్డం నవీన్‌, జబర్దస్త్‌ చిట్టిబాబు, రేవతి నటీనటులుగా రూపొందుతున్న చిత్రం బాలుగాడి లవ్‌స్టోరీః. యల్‌.శ్రీనివాస్‌ తేజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వీడియో బైట్‌ ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేసిన చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ లాంచ్‌ అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకులు సముద్ర చిత్ర మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ హరి గౌడ్‌, శ్రీహరి గౌడ్‌, రెవలాన్స్‌ కాస్మటిక్స్‌ సౌత్‌ ఇండియా ఇన్చార్జి  మహేష్‌, చిందం మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
               ఈ సందర్భంఆ నిర్మాత ఆకుల భాస్కర్‌ మాట్లాడుతూ, దర్శకుడు శ్రీనివాస్‌ తేజ్‌ చెప్పిన కథ నచ్చడంతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా తీశాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మార్చిలో విడుదల అవుతున్న మా సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానుః అని తెలిపారు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం లవ్‌, క్రైమ్‌, సస్పెన్స్‌తో చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు కొత్త వారైనా చాలా బాగా నటించారు. ఇందులో ఐదు పాటలు ఉండగా, ఒక్క ఐటమ్‌ సాంగ్‌ మినహా షూటింగ్‌తో పాటు టాకీ పార్ట్‌ మొత్తం పూర్తి చేశాంః అని దర్శకుడు యల్‌.శ్రీనివాస్‌ తేజ్‌ అన్నారు. హీరో ఆకుల అఖిల్‌ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో రొమాన్స్‌, యాక్షన్‌, సస్పెన్స్‌ ఇలా చాలా ఉన్నాయి. మంచి కథతో వస్తున్న ఈ సినిమా మంచి హిట్‌ అయితే మా పేరెంట్స్‌కు ఈ సినిమాను గిఫ్ట్‌గా ఇస్తానుః అని చెప్పారు. హీరోయిన్‌ దర్శక మీనన్‌ మాట్లాడుతూ,  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలుః అని తెలిపారు.

Spread the love