సర్వజనుల హితమే గాంధీ ఆదర్శాలు

– సీఎం కేసీఆర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనను స్మరించుకున్నారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన గాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని సీఎం పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ… విజయతీరాలకు చేరాలనే స్పూర్తినీ ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Spread the love