సీఎం కేసీఆర్‌ సహకారం వల్లే..

–  నిఖత్‌ జరీన్‌ ఈ స్థాయికి
–  అవార్డుల ప్రదానంలో భావోద్వేగానికి
గురైన తండ్రి జమీల్‌
న్యూఢిల్లీ : సీఎం కేసీఆర్‌ సహకారమే లేకుంటే నిఖత్‌ జరీన్‌ ఈ స్థాయికి వచ్చేదే కాదు.. అవార్డుల ప్రదానంలో నిఖత్‌ తండ్రి జమీల్‌ భావోద్వేగానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ నామినేట్‌ అయ్యింది. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్‌ఎల్‌డీ జాతీయ అ ధ్యక్షుడు, ఎంపీ జయంత్‌ చౌదరి, ఆర్‌జీడీ ఎంపీ మనోజ్‌ ఝుజే, జేడీయూ మాజీ ఎంపీ కేసీ సింగ్‌, ఆప్‌ ఎంపీ సంజరు సింగ్‌ హాజరయ్యారు.

Spread the love