నవతెలంగాణ – అమరావతి: వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగాం. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర’’ అని చంద్రబాబు తెలిపారు.