నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, కుటుంబ సంక్షేమ విభాగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 27, 28 తేదీల్లో (మల్టీ జోన్ 1), 29న (మల్టీజోన్ 2) కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.