సీపీఎస్‌ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) డైరీని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సమగ్ర సమాచారంతో రూపొందించిన ఈ డైరీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుం దని ఆయన చెప్పారు. సీపీఎస్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత పెన్ష న్‌ పద్ధతిలో కుటుంబ పెన్షన్‌ను మంజూరు చేశారని గుర్తు చేశారు. టీఎస్‌సీపీ ఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, రాష్ట్ర కోశాధికారి నరేష్‌గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మ్యాన పవన్‌, దర్శన ్‌గౌడ్‌, ఉపేందర్‌, మల్లికార్జున్‌, దేవయ్య, నరేందర్‌రావు, కోటకొండ పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల ఫ్యామిలీ పెన్షన్‌ ఆర్డర్స్‌ వచ్చిన సందర్భంగా ఇద్దరు పెన్షనర్లకు రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ చేతుల మీదుగా వాటిని అందించారు.

Spread the love