– ఐర్లాండ్‌తో హర్మన్‌సేన ఢీ నేడు
– ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
పోర్ట్ ఎలిజబెత్ : భారత మహిళల జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ బెర్త్‌పై కన్నేసిన టీమ్ ఇండియా నేడు ఐర్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్-2లో మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన భారత్.. నేడు ఐర్లాండ్‌పై భారీ విజయం సాధిస్తేనే సెమీఫైనల్లోకి నేరుగా చేరనుంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌లు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినా.. పాకిస్థాన్ జట్టు ఇంకో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. నేడు ఐర్లాండ్‌పై భారత్ విజయం సాధిస్తే ఆరు పాయింట్లతో గ్రూప్-2లో రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకోనుంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మెరుగ్గా రాణించినా.. ఓటమి చెందిన హర్మన్‌ప్రీత్ సేన.. నేడు ఐర్లాండ్‌పై ధనాధన్ దండయాత్ర చేయనుంది. భారత్‌కు మంధాన, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుక సింగ్ కీలక కానుండగా.. ఐర్లాండ్ తరఫున లెవిస్, ఓర్లా, కెల్లి, లారా డెలానీలు కీలక పాత్ర పోషించనున్నారు. భారత్, ఐర్లాండ్ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ఆరంభం కానుంది.