– గాంధారి మండల బంజారా జెఏసి నాయకులు డిమాండ్
నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని సేవలాల్ జగదాంబ ఆలయం వద్ద ఏర్పాటు చేసినగాంధారి మండల బంజారా యువజన సంఘం జెఏసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జెఏసి నాయకుడు ప్రేమదాస్ మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నీప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బంజారా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమనికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని వివిధ తండా నుండి నాయక్, కార్బరీ, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఎంపీటీసీ యువ నాయకులు అందరూ వచ్చి సేవలాల్ జయంతి వేడుకలు విజయవంతం చేయగలరని జెఏసి నాయకులు కోరారు.