సేవాలాల్ మహరాజ్ జయంతి రోజును ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలి

– జిల్లా గిరిజన విద్యారి సంఘం
 నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన విద్యారి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ దాస్ నాయక్ మాట్లాడారు.  శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి 15/02/2023 నాడు గాంధారి మండల కేంద్రంలో నిర్వహించే జయంతి కార్యక్రమాన్ని మండలంలోని గిరిజనులు విజయవంతం చేయాలని గిరిజన సోదరులకు కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని గిరిజన విద్యార్థి సంగం తరపున డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా గిరిజన బంధు ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. గాంధారి మండలంలోని వి విధ తండాల నుండి ప్రజలు పెద్దసంఖ్య లోపాల్గొనిసేవలాల్ మహరాజ్ జయంతిని విజయవంతం చేయాలని కోరారుమహరాజ్ జయంతి శిబిరం వద్ద కామారెడ్డి సాధన హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్లు జామున రాథోడ్, వెంకట్ రాథోడ్ లు తెలిపారని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో నాయకులు పరుశురాం నాయక్, దేవి సింగ్, ప్రకాష్ నాయక్ ,సర్దార్ నాయక్ , ప్రవీణ్, ప్రకాష్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love