స్నేహం అనేది కొలతలో కొలువ లేనిది

– పూర్వ గురువు రిటైర్డ్ టీచర్స్ అధ్యక్షులు ఇ. నరసింహారెడ్డి
నవతెలంగాణ-ధర్మసాగర్
స్నేహమనేది కొలతలో కొలువ లేనిదని,అది ఎన్నటికీ విడదీయరానిది,మరిచిపోలేనిది అని పూర్వ గురువు రిటైర్డ్ టీచర్స్ అధ్యక్షులు ఇ.నర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్ లో ఆదివారం1994-95 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్ననాటి కాలం తిరిగి రానిదని,వాటిని స్మరించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిదన్నారు.
27 సంవత్సరాలుగా విడిపోయిన స్నేహితులు, వారి వారి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ గడిపిన ఈరోజు ఎన్నటికీ తిరిగి రానిదన్నారు.ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.అనంతరం పూర్వ గురువులు వారిని ఉద్దేశించి మాట్లాడారు. జీవితం చాలా చిన్నదని జీవించినంత కాలం హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలన్నారు.
ఇందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటూ, భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు తమ తమ ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటూ, స్థిరమైన జీవితం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. తదనంతరం గురువులందరికి తీపి జ్ఞాపకాలతో, పుష్పగుచ్చాలతో, శాలువలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గురువులు సత్యపాల్ రెడ్డి, ప్రభాకర్, సమ్మయ్య,సుకూర్, రంజిత్ సింగ్, కృష్ణవేణి, కళావతి, వజ్ర,వాణి,సత్య, సరస్వతి, కమిటీ సభ్యులు గుర్రపు రాజు, పుట్ట నవీన్, కొట్టే జలంధర్, బొడ్డు కమలాకర్, సుంకనపల్లి రాజ్ కుమార్, రమేష్, సదయ్య, వీరస్వామి, గుడి వెనుక దేవేందర్, గంకిడి శ్రీనివాస్ రెడ్డి చిలుక రవీందర్, మాచర్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love