హనుమాన్ ఆలయ వార్షికోత్సవలలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని మాధవపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం 6 వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ ఆలయంలో నిర్వహించిన రాజా శ్యామల యజ్ఞం మరియు పూజ కార్యక్రమాలలో  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధ బలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, మాజీ జడ్పీటీసీ తనాజీరావు, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు సాయికుమార్, మాధవపల్లి సర్పంచ్ లక్ష్మీబాయి మహిపల్ రావు, ఏఏంసి మాజీ చెర్మెన్ సత్యం,ఎంపిటిసి పత్తి శ్రీనివాస్, నాయకులు తాడ్వాయి సంతోష్, బెజగం సంతోష్, ముకుంద్ రావు, శివాజీ రావు, గ్రామస్తులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love