హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్..భార‌త్, ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా

నవతెలంగాణ – హైదరాబాద్
రెండో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాప‌ర్‌గా నిల‌వాల‌నుకున్న భార‌త పురుషుల హాకీ జ‌ట్టుకు నిరాశే ఎదురైంది. గ్రూప్ డిలో ఆదివారం భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు గోల్ కొట్టే అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేదు. తొలి అర్థ భాగంలో భార‌త ఆట‌గాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. రెండో అర్థ‌భాగంలో ఇండియా ప‌లు అవ‌కాశాల్ని సద్వినియోగం చేసుకోలేక‌పోయింది. ఇంగ్లండ్ గోల్ కీప‌ర్ ఒలివ‌ర్ పైన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. స్వ‌దేశంలో జ‌రుగుతున్న హాకీ వ‌ర‌ల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భార‌త్ బోణీ కొట్టింది. బిర్సాముండా స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో 2-0తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. దాంతో టీమిండియాకు 3 పాయింట్లు ల‌భించాయి.

Spread the love