హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటి వద్ద మహిళ హల్‌చల్‌


హైదరాబాద్:
సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌ నివాసం వద్ద ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన ఓ మహిళ సాయిదరమ్‌ను కలిసేందుకు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కాపలాదారులు అడ్డుకున్నారు. దీంతో పెద్దగా అరుస్తూ హడావుడి చేసింది. అక్కడే ఉన్న కాపలాదారులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తమిళనాడు, మదురైకు చెందిన జోస్‌ కమల అని తేలింది. సాయిదరమ్‌ను కలిసేందుకు వచ్చినట్టు ఆమె చెప్పింది. కాగా ఆమె మతిస్థితిమితం సరిగా లేదని విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love