హైదరాబాద్‌లో పిజ్జా బ్రాండ్‌ గోపిజ్జా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్‌ హెచ్‌క్యూ పిజ్జా బ్రాండ్‌ గోపిజ్జా, తమ మొట్టమొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఔట్‌లెట్‌ను బుధవారం హైటెక్‌ సిటీలోని శరత్‌ సిటీ మాల్‌, రెండో అంతస్తులో సినీనటి మధుషాలినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపిజ్జా ఇండియా సీఈఓ మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ ”హైదరాబాద్‌కు గోపిజ్జాను తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాం. కేవలం తాజా పదార్ధాలు మాత్రమే వాడడంతో పాటుగా మా వినూత్నమైన ఫ్లేవర్స్‌ను అత్యంత సరసమైన ధరలలో అందించనున్నాం. హైదరాబాదీయులు తమ పిజ్జాలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మాకు తెలంగాణా, ఏపీలో మంచి మార్కెటింగ్‌ అవకాశాలున్నాయి. రాబోయే రెండేండ్లల్లో తెలుగు రాష్ట్రాలలో 50 నూతన ఔట్‌లెట్లు ప్రారంభించనున్నాం’ అని తెలిపారు.

Spread the love