హైదరాబాద్‌ ఎఫ్‌సీ గెలుపు ఎటికె మోహన్‌

–  బగాన్‌పై 1-0తో విజయం
హైదరాబాద్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జోరు కొన సాగుతోంది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఎటికె మోహన్‌ బగాన్‌పై హైదరాబాద్‌ ఎఫ్‌సీ 1-0తో గెలుపొందింది. ప్రథ మార్థంలో గోల్‌ లేకుండా ముగియగా.. ద్వితీయార్థంలో చివర్లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ స్టార్‌ స్ట్రయికర్‌ను బరిలో నిలిపింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒగ్బాచే 86వ నిమిషంలో మెరుపు గోల్‌ కొట్టాడు. ఒగ్బాచే గోల్‌తో 1-0 ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌ సీజన్‌లో 12వ విజయం నమోదు చేసింది. 18 మ్యాచుల్లో 12 విజయాలతో హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఐఎస్‌ఎల్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Spread the love