హైదరాబాద్‌ తీన్‌మార్‌

– బెంగళూర్‌పై 3-2తో ఘన విజయం
నవతెలంగాణ, హైదరాబాద్‌ : సొంతగడ్డపై హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ తీన్‌మార్‌. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం బెంగ ళూర్‌ టార్పెడోస్‌పై 15-13, 14-15, 9-15, 15-10, 15-12తో గెలు పొందిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. కెప్టెన్‌ గురు ప్రశాంత్‌ 20 పాయిం ట్లతో చెలరేగగా.. డిఫెండర్‌ ట్రెంట్‌ ఒడియ 10 పాయింట్లతో రాణిం చాడు. తొలి సెట్లో నెగ్గిన హైదరాబాద్‌.. ఒత్తిడికి తలొగ్గి తర్వాత వరుసగా రెండు సెట్లలో పరాజయం పాలైంది. చివరి రెండు సెట్లను అద్భుతంగా నెగ్గిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సొంతగడ్డ సీజన్‌ను ఓటమి లేకుండా ముగించింది. హైదరాబాద్‌కు ఇది ఓవరాల్‌గా నాల్గో విజయం కాగా, పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ నాల్గో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌, బెంగళూర్‌ మ్యాచ్‌కు సినీ నటులు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ సహా దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, అనుదీప్‌లు హాజరయ్యారు.

Spread the love