అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం…

నవతెలంగాణ – అమెరికా
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మంచుతో గడ్డకట్టుకుపోయింది. రోడ్ల మీద, ఇండ్ల పైకప్పుల మీద అడుగుల మేర మంచు పేరుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మంచు కారణంగా నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మంచుతో చాలా చోట్ల ఇండ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. అటు టెక్సాస్, లూసియానాలో కూడా భారీగా మంచు కురుస్తోంది. దాదాపు ఏడు అడుగుల మేర హిమపాతం పేరుకుపోయింది. ఇళ్లు, రోడ్లు, కార్లపై భారీగా మంచు పేరుకుపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టెక్సాస్‌లోనైతే ఏకంగా 3.46లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Spread the love