నవతెలంగాణ-హిమాయత్ నగర్
అవని నృత్యాలయం నాలుగో వార్షికోత్సవం సంద ర్భంగా శివ తాండవ నత్యం పేరిట 60 మంది కళాకారులు శివుడి వేషధారణలో, 20 మంది కళాకారులు యోగాస నాలతో 60 నిమిషాల పాటు విద్యార్థులు చేసిన తాండవ నత్య హారతి కార్యక్రమం పది ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. ఈ మేరకు డాక్టర్ నామని రవి కుమార్‌కు అందుకు సంబంధించి క్లాసికల్ డాన్సర్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యోగ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్, నేష నల్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్, హైరేంజ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్, వండర్ ఇండియా రికార్డ్స్, అమేజింగ్ కిడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్సల్ రికార్డ్ హౌల్డర్స్ బుక్ తదితర పది ప్రపంచ రికార్డ్స్ ధ్రువపత్రాలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కె.వి.రమణారావులు అతిథులు అవని నృత్యాలయం వ్యవస్థా పకులు ధనలక్ష్మి, విజేంద్ర దంపతుల సమక్షంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ నామని రవికుమార్ పది ప్రపంచ రికార్డులు సాధించడం అభినందనీయమన్నారు. భారతీయ కళలను, సంస్కృతిని, సంప్రదాయాలను చాటుతూ ఈ నత్య హారతిలో చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారన్నారు. తల్లిదండ్రులు, చిన్నారులను భారతీయ కళలు, సంస్కతీ సంప్రదాల వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం లయన్ కె.వి.రమణారావు మాట్లాడుతూ.. అత్యత్భుతమైన ప్రతిభ కలిగిన వారికి, అద్భుతాలను సమీకరించి ప్రపంచ రికార్డులలో చోటు కల్పిస్తూ విశ్వ వ్యాప్తం చేస్తున్నామని తెలి పారు. ఎంతో మంది బుల్లితెర, వెండితెర ప్రముఖులకు వివిధ రంగాలలో విశేషమైన సేవలను గుర్తిస్తూ ప్రపంచ రికార్డులలో నమోదు చేస్తు న్నామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో పాట్రిసియా మాత్యు సెయింట్ మైకెల్స్ స్కూల్, పియర్సన్ స్కూల్ ప్రిన్సిపాల్ అస్మా షాహిదా, సెరినిటీ స్కూల్ కరెస్పాండంట్ నోముల జంగారెడ్డి, కుప్ప శ్రీకాంత్ గౌడ్, అడ్ల సతీష్ కుమార్, ఆర్.వి.సుబ్బు, డాక్టర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.