పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత..

నవతెలంగాణ- రాయపోల్
2023- 2024 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు పరీక్షల ఫలితాలు  రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం మంగళవారం పదవ తరగతి ఫలితాలను వెల్లడించారు. రాయపోల్ మండలం ఫలితాలు కూడా వచ్చాయని మండలంలో  మొత్తం 305 మంది విద్యార్థులు ఉండగా 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని మండల విద్యాశాఖ అధికారి నర్సమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో 6 జిల్లా పరిషత్ పాఠశాలలు,1 కేజీబీవీ పాఠశాల  ఉన్నాయి. వీటిలో మొత్తం 305 విద్యార్థులు ఉన్నారు. వీరిలో 305 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అనాజిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 మంది విద్యార్థులు, బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 82 మంది విద్యార్థులు, రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 76 మంది విద్యార్థులు, రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23 మంది విద్యార్థులు, రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 37 మంది  విద్యార్థులు, వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 34 మంది విద్యార్థులు, కేజీబీవీ 39  మంది విద్యార్థులతో కలిపి 305 ఉండగా మండలం మొత్తం 100% ఉత్తీర్ణత సాధించారు. కాగా మండలంలో ఇద్దరు విద్యార్థులు 10 జీపీఏ గ్రేడ్ సాధించారు. వారిలో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నిఖిత, రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి.అఖిల 10 జీపీఏ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకువచ్చారు.

Spread the love