– లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తే కఠిన చర్యలు
– రిటర్నింగ్ అధికారి ప్రతిక్ జైన్
నవతెలంగాణ-మణుగూరు
110 పినపాక నియోజకవర్గం ప్రజలు 100శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలందరూ ప్రశాంతంగా ఓటును ఓటు వేయాలని రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జడ్పీ కో ఎడ్యుకేషన్ పాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ స్టేషన్స్ 244 ఉన్నాయన్నారు. జనరల్ పోలింగ్ స్టేషన్స్ 241 కొత్తగా మూడు యాడ్ చేశామన్నారు. మొత్తం 244 పోలింగ్ స్టేషన్లో ప్రజలు ఓటును వినియోగించుకోనున్నారని అన్నారు. పినపాక నియోజకవర్గం మొత్తం పోలింగ్ సిబ్బంది 1156 మంది ఎల్‌డబ్ల్యూఈ 120 పోలింగ్ కేంద్రలకు 8 మంది చొప్పున బలగాలు కేటాయింపు జరిగిందన్నారు. మిగతా పోలింగ్ కేంద్రలకు ఒక్కొక్కరు చొప్పున కేటాయించమన్నారు. ఆళ్లపల్లి 11 పోలింగ్ కేంద్రలు, పురుషులు ఓటర్స్ 4372, మహిళా ఓటర్స్ 4309 టోటల్ 8682 ఓటింగ్ వినియోగించుకోనున్నారని అన్నారు. అశ్వాపురం మండలం 41 పొలింగ్ కేంద్రలు, పురుషులు ఓటర్స్ 15661, మహిళ ఓటర్స్ 16449 మొత్తంగా 32110 తెలిపారు. బూర్గంపాడు మండలం 57 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. మొత్తం 48645 ఇందులో పురుషులు 23957, మహిళా ఓటర్స్ 24686 కలిగి ఉన్నారని అన్నారు. గుండాల మండలం 17 పొలింగ్ కేంద్రలు మొత్తం ఓటర్స్ 12656, పురుషులు 6382, మహిళలు6274 ఓటర్స్ అన్నారు. కరకగూడెం పోలింగ్ కేంద్రాలు 14, మొత్తం ఓటర్స్ 12552, పురుషులు 6291, మహిళలు 6261 మొత్తం ఓటింగ్ ఉన్నదన్నారు. మణుగూరు మండలం 66 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్స్ 57498, ఇందులో పురుషులు 28356 ఓట్లకు హాజరుకానున్నారని తెలిపారు. మహిళలు 29140, పినపాక మండలం 38 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్స్ 26260 ఇందులో పురుషులు 12802, మహిళలు 13458, పినపాక నియోజకవర్గం మొత్తం ఏడు మండలాలకు గాను నియోజకవర్గ ఓటర్స్ 198402, ఏడు మండలాలకు గాను మూడు ఫ్లైయింగ్ స్క్యార్డ్ టీంలు ఉంటాయి. ఒక్కొక్క టీంలో నలుగురు సభ్యులు ఉంటారని తెలిపారు.