ప్రణాళిక బద్ధంగా చదివితే 10/10 జిపిఏ సాధ్యమే

– దేశి రామ్ ఏ టి డి ఓ ఐ టి డి ఏ
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివినట్లయితే 10/10 జీపీఏ సాధ్యమేనని ఐటిడిఏ ఏటిడిఓ దేశి రామ్ అన్నారు. ఆదివారం మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో దేశి రామ్ సమావేశం అయ్యారు. విద్యార్థులు ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని అనారోగ్యానికి గురికాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని నిరంతరం 10/10 జీపీఏ కోసం శ్రమించాలని సూచించారు. విద్యార్థులకు ఏ లోపం రాకుండా డిప్యూటీ వార్డెన్ బాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం సౌకర్యాలను లోటు లేకుండా చూసుకోవాలని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే విద్యార్థులు సంపూర్ణంగా విద్యను అభ్యసించేందుకు సన్నద్ధంగా ఉంటారన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love