108 అంబులెన్స్ లో సుఖ ప్రసవం

నవతెలంగాణ- కోటపల్లి

మండలం లోని లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన బుల్లే సౌందర్య 108 వాహనంలో ఆదివారం ఉదయం సుఖ ప్రసవం చేసింది. బుల్లే సౌందర్య కి ఆదివారం ఉదయం 5 గంటలకి పురిటి నొప్పుల రావడంతో 108 వాహనానికి ఫోన్ చేయగా లక్ష్మి పూర్ చేరుకున్న వాహన సిబ్బంది సౌందర్యాను తీసుకొని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించే క్రమంలో మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ను పక్కకి అపి వైద్యులు సుఖ ప్రసవం చేశారు.తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు మెరుగైన చికిత్స కోసం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు ఈఏంటి శాహబాజ్ పైలెట్ ఫరీద్ తెలిపారు.
Spread the love