తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
మార్చి 18 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 – థర్డ్ లాంగ్వేజ్
మార్చి 23 – గణితం
మార్చి 26 – ఫిజిక్స్
మార్చి 28 – బయాలజీ
మార్చి 30 – సోషల్ స్టడీస్

Spread the love