విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకం

నవతెలంగాణ -పెద్దవూర: ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని ఎంఎన్ఆర్ పౌండేషన్ ఛైర్మెన్, టైమ్ స్కూల్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని పెద్దగూడెం జెడ్పీ హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఫాడ్లు, పెన్నులు తనపౌండేషన్ ద్వారా పంపిణి చేసి మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికా కుండా మంచి సమయస్ఫూర్తితో పరీక్షలు రాయాలని తెలిపారు. మంచి జిపీఏ సాధంచి పాఠశాలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదేళ్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు మారేం రవీందర్, రేపాల అశోక్, గుంటుక రామాంజి రెడ్డి, గౌసోద్దీన్, సుదర్శన్, మేదరి దేవేందర్, జంగాల అరుణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love