టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభం కావడంతో పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులు శుక్రవారం మద్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ప్రకటించారు. మొత్తము 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 46,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. ఉత్తీర్ణతా శాతము 73.03 నమోదు అయ్యింది.

Spread the love