ఘోర రోడ్డు ప్రమాదం..11మంది మృతి

నవతెలంగాణ – రాజస్థాన్‌
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్‌పూర్‌ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని భావ్‌నగర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు బయల్దేరిన బస్సు బుధవారం తెల్లవారుజామున లఖ్నాపూర్‌ చేరుకుంది. అక్కడి ఆంత్రా ఫ్లైఓవర్‌పై హాల్టింగ్‌కు ఆగింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును గమనించని ఓ లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మరణించారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు. మరోవైపు ఏపీలోని విజయనగరం జిల్లా గజపతినగరంలో కూరగాయల ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. బాధితులను ధతిరాజేరు (మ) పెదకాడకు చెందినవారుగా గుర్తించారు.

Spread the love