నవతెలంగాణ – మహరాష్ట్ర: మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్లో సమృద్ధి ఎక్స్ప్రెస్వే పై తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ట్రావెలర్ బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. మృతుల్లో నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది. సైలాని బాబా దర్శనానికి వీరంతా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించారు.