తెలంగాణలో కొత్తగా 12 కరోనా పాజిటివ్‌ కేసులు

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,322 మందికి  కరోనా పరీక్షలు చేయగా వారిలో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, వరంగల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపిన వైద్యారోగ్య శాఖ, మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది.

Spread the love