13న హర్యాన గవర్నర్ యాదాద్రికి రాక..

Haryana Governor's arrival at Yadadri on 13..– జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
హరియాణా గవర్నర్  బండారు దత్తాత్రేయ శుక్రవారం 13 డిసెంబర్, 2024 తేదీ న  యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 11.30 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి దేవస్థానం లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం  01.00 గంటకు  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల – కాచారం గ్రామం, ధర్మారెడ్డి గూడెం మండల్, యాదాద్రి జిల్లాలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు / స్టడీ కిట్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 03.30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరా దేవస్థానం, మానెపల్లి హిల్స్, భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారనీ తెలిపారు.
Spread the love