నవతెలంగాణ – హైదరాబాద్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని వివిధ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే దేశంలోని అయిదు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జాబితాలో పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కోంకణ్ ప్రాంతం, గోవా, మధ్య మహారాష్ట్ర ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ యా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుణె, జార్ఖండ్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లో వర్షపు నీటి స్థాయిలు పెరిగాయని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే రానున్న రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే దేశ రాజధాని న్యూఢిల్లీలో సాధారణ స్థాయి వర్షపాతం మాత్రమే నమోదవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.