ధ్రువపత్రాల పరిశీలనకు 13,248 మంది హాజరు

– ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 973 మంది ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియలో బుధవారం 13,248 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. 63,455 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు వచ్చేనెల ఐదో తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. బుధవారం 973 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. వచ్చేనెల ఆరు వరకు ధ్రువపత్రాల పరిశీలన, ఎనిమిదో తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు గడువుందని తెలిపారు. ఇతర వివరాల కోసం www.: //tseamcet. nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love