నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. మూడు రోజుల విచారణ అనంతరం ఇవాళ సీబీఐ అధికారులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు జులై 12 వరకు రిమాండ్ విధించింది.