14 డేస్‌ లవ్‌ రిలీజ్‌కి రెడీ

14 డేస్‌ లవ్‌ రిలీజ్‌కి రెడీహరిబాబు దాసరి నిర్మాతగా, అఖిల్‌ అండ్‌ నిఖిల్‌ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగరాజు బోడెం దర్శకత్వంలో రూపొందిన యూత్‌ ఫుల్‌, కుటుంబ కథా చిత్రం ’14 డేస్‌ లవ్‌’. మనోజ్‌ పుట్టూర్‌, చాందిని భాగవని హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్‌, అంజలి ఐడ్రీమ్‌, రాజా శ్రీధర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఓ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?, వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అనే కోణంలో దర్శకుడు నాగరాజు బోడెం అత్యంత ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంప్రదాయ విలువలున్న ఈ చిత్రం జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love