15న వందే భారత్‌ రైలు ప్రారంభం

– వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్న ప్రధాని మోడీ
– ప్రత్యక్షంగా పాల్గొననున్న కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడువనున్న వందేభారత్‌ రైలు 15 నుంచి అందుబాటులోకి రానున్నది. ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో సంక్రాంతి పండుగ రోజు ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. వాస్తవానికి ఈ నెల 19న ప్రారంభించాల్సి ఉండగా ప్రధాని పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులు ముందుగానే ఆ రైలును ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ పూర్తయింది.

Spread the love