ఇసుక లారీ బీభత్సం.. 15 బైక్స్ నుజ్జునుజ్జు

నవతెలంగాణ -హైదరాబాద్: మద్యం మత్తులో ఇసుక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు.  భూపాలపల్లి పట్టణంలోని ఇసుక లారీ డ్రైవర్ నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో ఇసుక లారీని ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేశాడు. దీంతో  ఓ షాపు ముందు టూ వీలర్ పార్కింగ్ లో పార్క్ చేసిన 15 బైకులపై లారీ అతి వేగంగా వెళ్లింది. దీంతో ఆ బైక్ లన్నీ నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆ తర్వాత తన బైక్ ను పార్క్ చేస్తుండగా. .మైపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తిని కూడా లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో రంజిత్ లారీ కింద నరకయాతన అనుభవించాడు. అయితే స్థానికులు లారీని ఆపి లారీ కింద ఇరుక్కున్న  రంజిత్ ను బయటకు తీశారు. రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Spread the love